Thu Dec 19 2024 00:52:32 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : సుప్రీంకోర్టుకు వైసీపీ.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ
ైపోస్టల్ బ్యాలట్ వివాదంపై అధికార వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది
పోస్టల్ బ్యాలట్ వివాదంపై అధికార వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని వైసీీపీ నిర్ణయించింది. పోస్టల్ బ్యాలట్ చెల్లుబాటుపై హైకోర్టులో వైసీపీ అభ్యంతరం తెలిపింది. దేశమంతా ఒక నిబంధన అమలు చేస్తూ ఏపీలో మరొకలా నిర్ణయం ఏంటని వైసీీపీ తరుపున న్యాయవాదులు ప్రశ్నించారు.
ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై...
అయితే ఎన్నికల కమిషనర్ ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. పిటీషన్ ను నిరాకరించింది. పోస్టల్ బ్యాలట్ పై రిటర్నింగ్ అధికారి సంతకం లేకపోయినా చెల్లుబాటు అవుతుందని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో వైసీపీ సుప్రీంకోర్టు తలుపు తట్టనుంది. రేపు సుప్రీంకోర్టులో అత్యవసర పిటీషన్ ను దాఖలు చేసే అవాకశముది.
Next Story