Mon Dec 23 2024 08:07:47 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : రద్దీ బాగా తగ్గిందే.. ఆదివారమైనా.. రీజన్ ఇదేనా?
తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉంది. ఆదివారం అయినా రద్దీ పెద్దగా లేదు
తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉంది. ఆదివారం అయినా రద్దీ పెద్దగా లేదు. సంక్రాంతి సెలవులు పూర్తి కావడం, పరీక్షలు దగ్గరపడుతుండటంతో భక్తుల రాక తగ్గిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సాధారణంగా శని, ఆదివారాల్లో అత్యధికంగా భక్తులు తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే ఈరోజు మాత్రం రద్దీ అంతగా లేకపోవడంతో శ్రీవారి దర్శనం పెద్దగా సమయం లేకుండానే పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు దర్శనం గంటలో పూర్తవుతుంది.
హుండీ ఆదాయం..
నిన్న తిరుమల శ్రీవారిని 76,041 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 28,336 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని పది కంపార్ట్మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు దర్శన సమయం ఎనిమిది గంటలు పడుతుంది.
Next Story