Sun Dec 22 2024 11:21:03 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి 24 గంటలు
మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తిరుమలకు..
విద్యార్థులకు వేసవి సెలవులు కావడంతో.. కొద్దిరోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ ఉంటోంది. మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. నేడు కూడా స్వామివారి దర్శనార్థం భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్లన్నీ స్వామివారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులతో నిండిపోయి.. కాంప్లెక్స్ వెలుపలికి కూడా క్యూ పెరిగింది.
నేడు క్యూలో ఉన్న భక్తులకు సర్వదర్శనానికి 24 గంటలు పడుతుందని టీటీడీ వెల్లడించింది. గురువారం 66,820 మంది భక్తులు మొక్కులు చెల్లించుకుని, శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న (మే18) శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 36,905 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించారు.
Next Story