Tue Apr 22 2025 17:35:31 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో నేడు రద్దీ ఎలా ఉందంటే.. గోవిందా.. ఇంతగానా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. నేడు శుక్రవారం కావడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. నేడు శుక్రవారం కావడంతో తిరుమలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సంక్రాంతి సెలవులు పూర్తయినప్పటికీ రేపు శనివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. తిరుమలలోని వీధులన్నీ గోవింద నామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శనం ...
వైకుంఠ ద్వార దర్శనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తర ద్వారం నుంచి భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ముందుగానే బుక్ చేసుకుని తిరుమలకు వచ్చిన భక్తులు వైకుంఠద్వార దర్శనం చేసుకునేలా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ అందుబాటులోకి తేనుంది. 18వ తేదీ ఉదయం పది గంటల నుంచి 20వ తేదీ వరకూ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టిక్కెట్లు పొందిన వారు 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం లోపు టీటీడీకి సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది.
వేలాది మంది తరలి రావడంతో...
ఈరోజు తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శించుకునేందుకు వేలాది మంది తరలి వచ్చారు. ఇక మరోవైపు తిరుమల తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చివరి రోజు టోకెన్ల జారీ నేటితో ముగిసే అవకాశం ఉంది. జనవరి 20న దర్శనం కోరే భక్తులకు జనవరి 19న ఎస్ఎస్డీ టోకెన్లు జారీ చేయరని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలపిారు. వారు సర్వదర్శనం క్యూ లైన్లో మాత్రమే శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 19న ఆఫ్లైన్లో శ్రీ వాణి టిక్కెట్లు జారీ చేయబోమని కూడా అధికారులు తెలిపారు. మరోవైపు జనవరి 20వ తేదీన టీటీడీ ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఈ కారణంగా జనవరి 19న వీఐపీ బ్రేక్ దర్శనం కోసం ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story