Mon Dec 23 2024 02:31:18 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : చాంతాండత క్యూ.. ఈరోజు శ్రీవారిని దర్శించుకోవాలంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. తిరుమల కొండ భక్తులతో కిటికిటలాడుతుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకోవడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న ప్రసాదాలను క్యూ లైన్ లలో అందించే ఏర్పాట్లను చేస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి క్యూ లైన్ బయట వరకూ విస్తరించి ఉంది. శిలాతోరణం వరకూ క్యూ లైన్ ఉంది. సర్వదర్శనం క్యూలైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 71,510 మంది దర్శించుకున్నారు. వీరిలో 43,199 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.63 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story