Mon Dec 23 2024 05:43:36 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఈరోజు తిరుమలలో క్యూ లైన్ ఎంత పొడవుందో చూశారా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. శని, ఆదివారాలు భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉండనుంది. గత పదిహేను రోజుల నుంచి భక్తుల తాకిడికి తిరుమలలో ఎక్కువగా ఉంది. వేసవి సెలవులు ముగియనుండటం, పరీక్ష ఫలితాలు వెలువడటంతో భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు చేరుకోవడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఆదాయం మాత్రం...
నిన్న తిరుమల శ్రీవారిని 64,115 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 32,711 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపది దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులతో కూడిన క్యూ లైన్ బాట గంగమ్మ టెంపుల్ వరకూ విస్తరించి ఉంది. దీంతో ఉచిత దర్శనం చేసుకునే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై గంటల సమయం పడుతుందని అధికారులు చెప్పారు. అయితే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వసతి గృహాలు దొరకడం కూడా కష్టంగా మారింది.
Next Story