Mon Dec 23 2024 06:04:09 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఆదివారం భక్తుల రద్దీ ఎంతగా అంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం కావడంతో అత్యధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శని, ఆదివారాలు తిరుమలలో భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. ఈ రెండు రోజులు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అందులో భాగంగా ఈ రెండు రోజుల నుంచి భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. భక్తులకు వసతితో పాటు అన్నప్రసాదం వంటి వాటిని కూడా క్యూ లైన్ల ద్వారా పంపిణీ చేయనుంది.
క్యూ లైన్లు నిండి...
నిన్న తిరుమల శ్రీవారిని 70,686 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 34,563 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.02 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయి బయట ఆక్టోపస్ బిల్డింగ్ వరకూ క్యూ లైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది.
Next Story