Tue Nov 26 2024 13:22:12 GMT+0000 (Coordinated Universal Time)
హుండీ ఆదాయం ఇంతేనా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే అతి తక్కువ ఆదాయం ఈ మధ్య కాలంలో రావడం విశేషం.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే అతి తక్కువ ఆదాయం ఈ మధ్య కాలంలో రావడం విశేషం. ఇటీవల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం తగ్గింది. హుండీ కానుకలు రాలేదు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు స్వామి వారి దర్శనాన్ని కల్పిస్తున్నారు. తిరుమలకు అధిక సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నాటి నుంచి ఉత్తర ద్వార దర్శనం ద్వారానే భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.
ఉత్తర ద్వార దర్శనం...
తిరుపతిలో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఉత్తర ద్వార దర్శనం టిక్కెట్లను కేటాయిస్తున్నారు. అవి తీసుకున్న భక్తులు సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా నేరుగా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 47,481 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 15,695 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.10 కోట్ల రూపాయలు అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
Next Story