Tue Nov 26 2024 11:19:49 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రద్దీ ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం క్యూ లైన్ నుంచి భక్తులు ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శించుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వదర్శనం క్యూ లైన్ నుంచి భక్తులు ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఈ నెల 11వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయని తిరుమల తిరుపతి దేవస్థానం ముందే ప్రకటించింది. ఈ మేరకు టిక్కెట్లను కూడా విక్రయిస్తుంది. పెద్దసంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 67,169 మంది భక్తులను స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 21,222 మంది తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను టీటీడీ విక్రయించనుంది. ఈ నెల 12 నుంచి 31వ తేదీ వరకూ దర్శించుకునేందుకు వీలుగా మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విక్రయించనున్నారు. ఈరోజు 10 గంటలకు ఆన్ లైన్ లో టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
Next Story