Sun Nov 24 2024 15:40:29 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అయోధ్యకు వెళ్లలేని భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. అయోధ్యకు వెళ్లలేని భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అందుకే సోమవారం అయినా భక్తుల రద్దీ తిరుమలలో ఎక్కువగా ఉంది. కంపార్ట్మెంట్లలో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. దర్శనానికి ఎక్కువ సమయమే పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
పన్నెండు గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 77,334 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,694 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.04 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది.
Next Story