Mon Dec 23 2024 00:35:36 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : గోవిందా.. కరుణించవా.. కానరావా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కూడా భక్తుల రద్దీ అధికంగానే ఉంది. శ్రీవారి హుండీ ఆదాయం కూడా బాగా పెరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధికంగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమలకు వస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయానికి పైగా పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. సహజంగా శుక్ర, శని, ఆదివారాల్లో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఉచిత దర్శనంలో ఉన్న భక్తులు శ్రీవారి దర్శనం కావాలంటే పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.04 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story