Thu Nov 21 2024 12:45:27 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : కలియుగ వైకుంఠంలో తగ్గని క్యూ లైన్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల సంఖ్య తిరుమలలో ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల సంఖ్య తిరుమలలో ఎక్కువగా ఉంది. తిరుమలలోని అన్ని వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం నిరీక్షించాల్సి వస్తుంది. వసతి గృహాలు పొందడానికి క్యూ లైన్ చాంతాండంత ఉండటంతో చాలా సేపు వెయిట్ చేస్తే కానీ వసతి గృహాలు లభించడం లేదు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా తిరుమలలో ఇదే పరిస్థిితి నెలకొని ఉంది.
హుండీ ఆదాయం...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట ఏటీజీ వరకూ క్యూ లైన్ విస్తరించింది. క్యూలైన్ లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదాలను అందచేస్తున్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు నేడు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 79,584 మంది దర్శించుకున్నారు. వీరిలో 31,848 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. రేపటి నుంచి ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశముంది.
Next Story