Sun Jan 05 2025 07:35:46 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : బయట వరకూ క్యూలైన్లు.. తిరుమలలో బారులు తీరిన భక్తులు.. గంటల పాటు నిరీక్షణ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా భక్తుల సంఖ్య తిరుమలలో ఎక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా భక్తుల సంఖ్య తిరుమలలో ఎక్కువగా ఉంది. వరస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. శని, ఆది, సోమవారాలు సెలవులు కావడంతో ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో చేరుకోవడంతో తిరుమల వీధులు కిటకిట లాడుతున్నాయి. కనీసం వసతి గదులు దొరకడం కూడా కష్టంగా మారింది. వసతి గదుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్వనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
అన్ని కంపార్ట్మెంట్లలో...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయ.ి వెలుపల వరకూ క్యూ లైన్లో భక్తుల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనంలో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 69,870 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 42,119 మంది భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు. మరికొద్ది రోజుల పాటు ఇదే రష్ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలోనే భక్తులకు ఉచితంగా అన్నప్రసాదాలను అందచేస్తున్నారు.
Next Story