Wed Oct 30 2024 07:24:31 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : గోవిందా.. క్యూ లైన్ లోకి వెళితే.. ఒకటిన్నర రోజు ఉండాల్సిందేనా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరస సెలవులు రావడంతో భక్తులు రద్దీ పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరస సెలవులు రావడంతో భక్తులు రద్దీ పెరిగింది. సోమవారం బక్రీద్ కూడా సెలవు ఉండటంతో వరస సెలవులు రావడంతోనే తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. తిరుమలలో వసతి గృహాలు దొరకక కూడా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వసతి గృహాల కోసమే గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తోంది. ముందుగా ప్రత్యేక దర్శనం బుక్ చేసుకున్న వారితో పాటు ఇతర భక్తులు కూడా చేరుకోవడంతో రద్దీ పెరిగింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
అన్ని కంపార్ట్మెంట్లలో...
ఈరోజు వైకుంఠం కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. బయట నందకం గెస్ట్‌హౌస్ వరకూ క్యూ లైన్ విస్తరించి ఉంది. ఉచిత దర్శనానికి భక్తులకు ముప్ఫయి గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. ఒక్కసారి క్యూ లైన్ లోకి వెళితే రోజున్నర తర్వాత మాత్రమే బయటకు వస్తారు. దీంతో టీటీడీ అన్న ప్రసాదాలను భక్తులకు క్యూలైన్లలోనే అందిస్తుంది. నిన్న తిరుమల శ్రీవారిని 82,886 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 44,234 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story