Mon Dec 23 2024 12:31:18 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో తగ్గని రద్దీ.. ఈరోజు స్పెషల్ దర్శన్ టిక్కెట్లు విడుదల
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతుంది.
తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి ఎస్ఎంసీ జెనరేటర్ వరకూ క్యూ కొనసాగుతుంది. ఒక్కసారిగా భక్తులు చేరుకోవడంతో అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్నటి నుంచే తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిందని, క్యూ లైన్లలో ఉన్న వారికి అన్నప్రసాదాలు, మంచినీరును అందచేస్తున్నమని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు.
హుండీ ఆదాయం...
నిన్న ఒక్కరోజే 76,418 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 38,629 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.73 కోట్ల రూపాయలు అని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులందరికీ దర్శనం కల్పిస్తామని, సంయమనం పాటించాలని అధికారులు కోరుతున్నారు.
సెప్టెంబరు నెల..
మరోవైపు ఈరోజు స్టెప్టంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేస్తుంది. ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల కానున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సెప్టంబరు నెలలో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకోదలచుకునే వారు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు.
Next Story