Mon Nov 25 2024 11:44:57 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గత కొన్ని రోజులుతో పోలిస్తే భక్తుల రద్దీ తగ్గిందనే చెప్పాలి
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గింది. గత కొన్ని రోజులుతో పోలిస్తే భక్తుల రద్దీ తగ్గిందనే చెప్పాలి. వైకుంఠం కాంప్లెక్స్ లోని ఏడు కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి 7 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. వీకెండ్ వస్తుండటంతో తిరిగి భక్తుల రద్దీ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
హుండీ ఆదాయం...
నిన్న తిరుమల శ్రీవారిని 73,375 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 31,117 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.71 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను సమకూరుస్తున్నామని అధికారులు తెలిపారు.
Next Story