Tue Nov 26 2024 11:23:31 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో తగ్గిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. గతంలో పోలిస్తే భక్తుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది
తిరుమలలో భక్తుల రద్దీ కొంత తగ్గింది. గతంలో పోలిస్తే భక్తుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. వైకుంఠ ద్వార దర్శనం ఇంకాకొనసాగుతుండటంతో భక్తులు టిక్కెట్లు పొందిన వారికే అనుమతిస్తున్నారు. దీంతో సాధారణంగా సర్వదర్శనం నుంచి వచ్చే భక్తుల సంఖ్య పెద్దగా లేదు. ఉత్తర్ ద్వార దర్శనం టిక్కెట్లను ముందుగా కొనుగోలు చేసిన వారికే దర్శనం లభిస్తుండటం, వసతి సౌకర్యం దొరుకుతుందా? లేదా? అన్న అనుమానంతో భక్తులు తమ తిరుమల యాత్రను వాయిదా వేసుకున్నట్లు కనపడుతుంది.
రేపటి నుంచి...
నిన్న తిరుమల శ్రీవారిని 58,184 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దాదాపు 16,121 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.20 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. రేపటి నుంచి సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం ద్వారా భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు.
Next Story