Mon Nov 25 2024 13:28:10 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో రద్దీ తగ్గింది.. కారణమిదే?
తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు కొంత తగ్గింది. చాలా రోజుల తర్వాత భక్తుల రద్దీ కొంత తగ్గిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ ఈరోజు కొంత తగ్గింది. చాలా రోజుల తర్వాత భక్తుల రద్దీ కొంత తగ్గిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈరోజు భక్తులు ఆరు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. దర్శనానికి కేవలం ఆరు గంటల సమయం పడుతుందని చెప్పారు. గత రెండు నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్లు బయటకు కన్పించేవి. శ్రీవారి దర్శన సమయం కూడా పది గంటల సమయానికి పైగానే పట్టేది.
నిన్న హుండీ ఆదాయం...
కానీ ఈరోజు అనూహ్యంగా భక్తుల రద్దీ తగ్గిందనే చెప్పాలి. నిన్న ఆదివారం కావడంతో తిరుమల శ్రీవారిని 80,815 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,562 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.82 కోట్ల రూపాయలు అని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. చాలా రోజుల తర్వాత తిరుమల కొండపై భక్తుల రద్దీ కొంత తగ్గిందనే చెప్పాలి.
Next Story