Tirumala : వామ్మో తిరుమలలో ఒక్కసారిగా ఇంత రద్దీనా? దర్శనం కష్టమేనా?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో పాటు దీపావళి పండగకు వరస సెలవులు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో పాటు దీపావళి పండగకు వరస సెలవులు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమలకు అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిటకిట లాడుతున్నాయి. గత కొద్ది రోజులుగా తక్కువగా ఉన్న రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వీధులన్నీ ఎక్కడ చూసినా భక్తులే. అన్నదాన సత్రం వద్ద కూడా ఉదయం నుంచి భక్తుల రాక ఎక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. లడ్డూ పంపిణీ కేంద్రాల వద్ద కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు. లడ్డూలను తీసుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇక వసతి గృహాల సంగతి చెప్పనవసరం లేదు. వసతి గృహాల కోసం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎవరైనా ఖాళీ చేస్తేనే వెంటనే వాటిని భక్తులకు వరసగా కేటాయిస్తున్నారు. దీంతో వసతి గృహాల వద్ద కూడా లైన్ పెద్దగా దర్శనమిస్తున్నాయి. దీంతో తిరుమల భక్తులతో కళకళలాడిపోతుంది. గత వారం పది రోజుల నుంచి బోసి పోయిన తిరుమల ఈరోజు మాత్రం భక్తులతో దర్శనమిస్తుంది.