Tirumala : నేడు కిటకిటలాడుతున్న తిరుమల.. ఒక్కసారిగా పెరగడంతో?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. జనవరి 1వ తేదీ నుంచి తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. కొత్త ఏడాది ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరుతున్నారు. అదే సమయంలో దర్శన సమయం కూడా ఆలస్యమవుతుంది. కంపార్ట్ మెంట్ లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇక ఈ నెల 10వ తేదీ నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ఉండటంతో తిరుమల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. ఇప్పటికే లక్షల్లో టిక్కెట్లు అమ్ముడుపోయాయి. వైకుంఠం ద్వార దర్శనం ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ ఉంటుంది. ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామి వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఇప్పటి నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా తగ్గించేందుకు టీటీడీ సిద్ధమయింది. సిఫార్సు లేఖలను కూడా ఈ సమయంలో పెద్దగా అనుమతించబోరని అంటున్నారు. ఇప్పటికే టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. మరొకవైపు ఇంకో లక్ష టిక్కెట్లను తిరుమల, తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయించడానికి టీటీడీ సిద్ధమవుతుంది. వైకుంఠ ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు ముందుగానే వచ్చి తిరుమల ఏడుకొండల వాడిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now