Tue Jan 07 2025 02:56:34 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఒక్కసారిగా పెరిగిన రద్దీ... దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో భక్తులు తిరుమల కొండకు అధిక సంఖ్యలో చేరుకున్నారు
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. సంక్రాంతి సెలవులు కావడంతో భక్తులు తిరుమల కొండకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. కంపార్ట్ మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాల సంఖ్య కూడా దొరకడం లేదు. అయితే తిరుపతి వాసులు ఎక్కువ మంది రావడంతో భక్తుల రద్దీ పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. సెలవుల వల్లనే భక్తుల రద్దీ అధికంగా ఉందని, స్వామి వారిని పండగవేళ దర్శించుకునేందుకు వచ్చారని అధికారులు అంటున్నారు.
ఇరవై నాలుగు గంటలు..
నిన్న తిరుమల శ్రీవారిని 86,107 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 29,849 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.13 కోట్ల రూపాయలు వచ్చిందని తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్్లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది.
Next Story