Fri Dec 20 2024 11:18:24 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ.. రీజన్ అదే
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నటి వరకూ ఖాళీగా కనిపించిన క్యూ లైన్లు నేడు భక్తులతో నిండి ఉన్నాయి
తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నట ివరకూ ఖాళీగా కనిపించిన క్యూ లైన్లు నేడు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. మొన్నటి వరకూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం, ఆ తర్వాత కొంచెం తగ్గుముఖం పట్టింది. అయితే వీకెండ్ కావడంతో మళ్లీ రష్ మొదలయింది. రేపు, ఎల్లుండి శని, ఆదివారాలు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
క్యూ కాంప్లెక్స్ లోని...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్లో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 62,055 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,088 మంది భక్తులు తలనీలలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.58 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story