Thu Apr 03 2025 21:29:01 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఇంతగా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ అంత ఎక్కువగా లేదు. మరీ అంత తక్కువగా లేదు. భక్తులు శ్రీవారి దర్శనం కోసం కొద్దిసేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. క్యూ లైన్ లలో కూడా వేచి ఉన్నారు. మంగళవారం సహజంగా భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. అలాగే ఈరోజు కూడా అంతే అనిపిస్తున్నప్పటికీ గతంలో మాదిరిగా కాకుండా ఒక మోస్తరులో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్ధానం అధికారులు తెలిపారు. రేపు శివరాత్రి సెలవు కావడంతో ఈరోజు కొందరు భక్తులు ముందుగా తిరుమలకు చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదే కారణం...
తిరుమలకు భక్తులు వేసవి కాలంలో ఎక్కువ మంది వస్తారు. వేసవి సెలవులతో పాటు విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన తర్వాత మరింత రద్దీ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో సీజన్ తో సంబంధం లేకుండా భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ముందుగా ఆన్ లైన్ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న భక్తులతో పాటు రోజువారీ ఎస్.ఎస్.డి. టోకెన్లు టీటీడీ జారీ చేస్తుండటంతో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారని అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని నాలుగు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి ర్ధనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,764 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,504 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.14 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story