Wed Mar 26 2025 15:37:19 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : గురువారం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో తగిన సంఖ్యలో భక్తులు లేరు

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గురువారం కావడంతో తగిన సంఖ్యలో భక్తులు లేరు. అయితే రేపటి నుంచి వరస సెలవులు రావడంతో పాటు శుక్ర, శని, ఆదివారాలు వరసగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు తిరుమలలో రద్దీ పెద్దగా లేకపోవడంతో లడ్డూ ప్రసాదాల తయారీని కూడా కొంత తగ్గించారు. అయితే పరీక్షలు ప్రారంభం కావడంతో కొంత రద్దీ తగ్గినా ఈ నెలాఖరు నుంచి తిరిగి రద్దీ పెరుగుతుందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు.
సులువుగానే దర్శనం...
తిరుమలలో నేటితో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈరోజు కూడా సహస్ర దీపాలంకరణ, అంగ ప్రదిక్షిణలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు. భక్తులు నేడు సులువుగా స్వామి వారిని దర్శించుకుంటుండటంతో పాటు ఎక్కువ సేపు స్వామిని చూసే అవకాశం కలిగింది. ఈరోజు మధ్యాహ్నానికి భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. అన్నదాన ప్రసాదం వద్ద కూడా పెద్దగా రష్ లేదు. అలాగే లడ్డూల కౌంటర్ వద్ద కూడా భక్తుల తాకిడి అంతగా కనిపించడం లేదు.
ఎనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 68,509 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,105 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.86 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story