Mon Nov 25 2024 15:32:02 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో భక్తుల రష్... దర్శన సమయం?
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. వారాంతపు సెలవు దినాలే కాకుండా మిగిలిన రోజుల్లోనూ రద్దీ ఎక్కువగా ఉంటుంది.
తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. వారాంతపు సెలవు దినాలే కాకుండా మిగిలిన రోజుల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత తిరుమల శ్రీవారి దర్శనాలను పూర్థిస్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుమతి ఇవ్వడంతో భక్తుల రాక పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా గత వారం రోజులుగా ఇతర రాష్ట్రాల భక్తులు ఎక్కువగా వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది.
హుండీ ఆదాయం...
ఈరోజు 31 కంపార్ట్మెంట్లలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి 9 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పారు. నిన్న తిరుమల శ్రీవారిని 73,439 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,490 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.30 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story