Tirumala : తిరుమలలో ఈరోజు మళ్లీ పెరిగిన రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు తగ్గడంతో పాటు వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో భక్తుల తాకిడి ఈరోజు ఎక్కువగా ఉంది. తిరుమలలో వాతావరణం కొంత చల్లగా ఉన్నప్పటికీ వర్షం కురియడం లేదు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వీధులన్నీ భక్తులతో కిటికటలాడుతున్నాయి. ఎక్కడ చూసినా భక్తులే. తలనీలాలను సమర్పించే చోట కూడా రష్ కొనసాగుతుంది. వసతి గృహాలు దొరకడానికి కూడా గంటల సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. భక్తులు ఇబ్బంది పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ భక్తులు ఏదో ఒక చోట ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అన్నదాన సత్రం కూడా భక్తుల రద్దీ ఈరోజు ఉదయం నుంచి ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు శని, ఎల్లుండి ఆదివారాలు కావడంతో మూడు రోజుల పాటు భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లను చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.