Tue Jan 07 2025 02:59:56 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : ఈరోజు శ్రీవారి దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వీకెండ్ సమీపించడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. వీకెండ్ సమీపించడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. ప్రతి వీకెండ్ కు భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. శని, ఆదివారాల్లో క్యూలైన్లన్నీ నిండిపోతాయి. శుక్రవారం కూడా అదే పరిస్థితి. ఈరోజు తిరుమలకు వచ్చిన భక్తులు శనివారం కూడా ఉండి స్వామి వారిని దర్శించుకుంటుంటారు. శనివారం శ్రీవారిని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని భావించడమే ఇందుకు కారణం. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
పన్నెండు గంటలలో...
ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ఇరవై రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులు ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశిస్తే శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 57,357 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 18,924 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story