Mon Dec 23 2024 00:50:53 GMT+0000 (Coordinated Universal Time)
Tiruamala : ఒక్కసారిగా పెరిగిన ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. హుండీ ఆదాయం కూడా ఒక్కసారిగా పెరిగింది
తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. తుఫాను ప్రభావం తగ్గడం, రద్దయిన రైళ్లు తిరిగి ప్రారంభం కావడంతో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. తుఫాను ప్రభావంతో కొంత భక్తుల రద్దీ రెండు రోజుల పాటు తగ్గింది. అయితే ఈరోజు మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ లో మరింత పెరిగే అవకాశముందన్న అంచనా వేస్తున్నారు. మూడు వందల రూపాయల టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం మూడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
పన్నెండు గంటలు...
నిన్న తిరుమల శ్రీవారిని 64,882 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,900 మంది భక్తులు తలనీలలాలను సమర్పించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.28 కోట్ల రూపాయలు పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పదమూడు కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుంది.
Next Story