Tiruamala : వెయిటింగ్ ఎంత సేపు అంటే .. నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. కార్తీక మాసం కావడంతో తిరుమలను దర్శించే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒకింత రద్దీ తగ్గుతుందని టీటీడీ అధికారులు అంచనా వేసినప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అందుకు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధానంగా కంపార్ట్ మెంట్లలో భక్తులకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుతున్నారు. అన్నదాన సత్రం వద్ద కూడా రద్దీ ఎక్కువగా ఉంది. ఇక లడ్డూల కౌంటర్ వద్ద కూడా రద్దీ మరింత ఎక్కువ కావడంతో ఎక్కువ కౌంటర్ల ద్వారా లడ్డూలను విక్రయిస్తున్నారు. అయితే రేపు కార్తీక సోమవారం కావడం, చివరి సోమవారం కావడంతో తిరుమలకు ఒకింత భక్తుల తాకిడి తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. సోమవారం నుంచి గురువారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ అంతగా ఉండదు. అయితే రేపు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం మాత్రం లేకపోలేదు.