స్కిన్ ఎలర్జీతో ప్రాణానికే ముప్పని ప్రచారం చేస్తున్నారు: సజ్జల
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై జరుగుతున్న
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. చంద్రబాబుకు ముప్పు ఉందంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషమించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ డ్రామాలాడుతోందని.. స్కిన్ ఎలర్జీతో ప్రాణానికే ముప్పని ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. జైలు అధికారులు, డాక్టర్ల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే కోర్టు రిమాండ్కు పంపింది. జరిగిన తప్పు మీద టీడీపీ మాట్లాడటం లేదన్నారు సజ్జల. జైలు ఏమైనా అత్తగారి ఇల్లా.. ఏసీ పెట్టమని అడుగుతున్నారన్నారు. ఇంటి నుంచి తెచ్చిన భోజనాన్నే చంద్రబాబు తింటున్నారని.. భోజనాన్ని కూడా జైలు అధికారులు పరీక్షించాకే అనుమతిస్తున్నారన్నారు. ప్రతీరోజూ చంద్రబాబు ఆరోగ్యాన్ని వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపారు. జైలులో సకల సౌకర్యాలు ఉండాలనుకుంటున్నారు టీడీపీ నేతలు అని సజ్జల విమర్శించారు. కోర్టు చెప్పకముందే జైలు అధికారులు వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు.