Sajjala : సజ్జల సైడ్ అయిపోయినట్లేనా? కేసుల భయమేనా?
వైసీపీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ వ్యవహారాల నుంచి కొంత పక్కకు తప్పుకున్నట్లే కనిపిస్తుంది.
వైసీపీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ వ్యవహారాల నుంచి కొంత పక్కకు తప్పుకున్నట్లే కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అయి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి విపక్షంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఒకింత బ్యాక్ బెంచ్ కే పరిమితమయినట్లే కనపడుతుంది. అంతకు ముందు ఐదేళ్లపాటు అంశం ఏదైనా మీడియాకు చెప్పడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వచ్చే వారు. సమావేశాల్లో కూడా ఆయన పాల్గొనే వారు. జగన్ ఆదేశాలను అమలు చేసేందుకే తాను ఉన్నట్లు సజ్జల వ్యవహరించేవారు. అన్ని శాఖలు ఆయన గుప్పిట్లోనే ఉండేవి. మంత్రులు అనేక మంది ఉన్నప్పటికీ సకల శాఖ మంత్రిగా ఆయన చెలామణి అయ్యేవారు. హోంశాఖ నుంచి అన్ని శాఖలలో ఆయన చెప్పినట్లు జరగాల్సిందే. పోలీసుల బదిలీ నుంచి ఇతర ఉన్నతాధికారుల ట్రాన్స్ ఫర్ వరకూ ఆయన ఆదేశాలకు అనుగుణంగా చేయాల్సిందే.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now