Mon Dec 23 2024 03:59:25 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు 'సక్సెస్' గురించి సజ్జల కామెంట్లు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి
టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ప్రజల్ని మోసం చేసి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలిచారని.. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని సజ్జల కౌంటర్లు వేశారు. గెలిచేందుకు చంద్రబాబు నాయుడు ఇష్టమొచ్చినట్లు హామీలిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి రాష్ట్రంలో ఎలా ఆరాచకం సృష్టిస్తున్నారో చూస్తున్నామన్నారు. కూటమి నేతలు వైసీపీకి ఓటు వేశారంటూ ప్రజలను హింసిస్తున్నారని, వ్యవస్థలను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కక్ష సాధింపులకు పాల్పడలేదని... ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించారని అన్నారు.
అమలు చేయాల్సిన హామీల నుంచి తప్పించుకోవాలని బాబు చూస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం సాధ్యం కాదని చంద్రబాబు నాయుడు సన్నాయినొక్కులు నొక్కుతున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని అంటున్నారని అన్నీ తెలిసి అలాంటి హామీలను ఎందుకిచ్చారో వాళ్లే చెప్పాలని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను ఎలా మోసం చేశారో అలాంటి మోసానికే మళ్లీ శ్రీకారం చుట్టారని చెప్పారు. రాష్ట్ర ఖజానా ఇంత దారుణంగా ఉందని అనుకోలేదని చంద్రబాబు అంటున్నారని, 6 నెలల క్రితమే ఈ విషయం ఆయనకు తెలుసని అయినప్పటికీ అధికారంలోకి రావడానికి అబద్ధపు హామీలు ఇచ్చారని విమర్శించారు.
Next Story