Tue Mar 18 2025 14:35:35 GMT+0000 (Coordinated Universal Time)
బాలినేని నివాసానికి సజ్జల.. అందుకే వెళ్లారా ?
సీఎం జగన్ తో కొత్త క్యాబినెట్ కూర్పుపై కసరత్తులు ముగిసిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి..

విజయవాడ : ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. మూడ్రోజుల క్రితం కేబినెట్లో మంత్రులంతా రాజీనామాలు చేయగా.. నేడు వాటన్నింటినీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. మధ్యాహ్నం కొత్త కేబినెట్ మంత్రుల పేర్లు గవర్నర్ వద్దకు వెళ్లాయి. కొత్త కేబినెట్ కోసం గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అయితే.. కొత్త కేబినెట్ లో ఉండేది వీళ్లేనంటూ ఓ లిస్ట్ బయటికొచ్చింది. ఆ లిస్ట్ లో..పాత, కొత్త మంత్రుల పేర్లు ఉన్నాయి. కానీ.. కొత్త కేబినెట్ లో తమకు స్థానముంటుందని ఆశించిన మంత్రులు అలకబూనినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ తో కొత్త క్యాబినెట్ కూర్పుపై కసరత్తులు ముగిసిన అనంతరం, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. విజయవాడ - బందరు రోడ్డులోని బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి తరలి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణ అంశాలపై బాలినేనితో చర్చించారు. అయితే.. బాలినేని ఇంటికి సజ్జల ఎందుకు వచ్చారన్నదానిపై పెద్ద చర్చే జరుగుతోంది. మూడేళ్లపాటు ఏపీ విద్యుత్ శాఖమంత్రిగా ఉన్న బాలినేనిపై.. విద్యుత్ రంగ సంక్షోభం నేపథ్యంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కొత్త కేబినెట్ లో చోటుందా ? లేదా ? అన్నదానిపై సందిగ్ధత నెలకొంది. లిస్టులో బాలినేని పేరు లేదని, అందుకే ఆయనను బుజ్జగించేందుకు సజ్జల బాలినేని నివాసానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది.
Next Story