Tue Dec 24 2024 01:16:05 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ వైఖరి ఏంటి?
రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ వైఖరి ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు
రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ వైఖరి ఎందుకు ప్రకటించలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. వెంకయ్య నాయుడుకు అవకాశం ఇవ్వకపోవడంతో వెనక్కు తగ్గారో? ఏమో తనకు తెలియదన్నారు. యశ్వంత్ సిన్హాకు ఆయన మద్దతిస్తారేమోనని అన్నారు. టీడీపీ ఇంతవరకూ ఎన్నికల్లో తమ మద్దతు ఎవరికన్నది చెప్పకపోవడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
రాజ్యాంగ పదవుల్లో...
రాజ్యాంగ పదవుల్లో ఏకాభిప్రాయం ఉండాలన్నది తమ పార్టీ సిద్ధాంతమన్నారు. అందుకే గతంలో స్పీకర్ గా కోడెల శివప్రసాద్ పోటీ చేసినప్పుడు కూడా తాము పోటీ చేయలేదని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎస్టీ మహిళ కావడం, తొలిసారి ఎస్టీలకు ఆ పదవి దక్కుతుండటంతో తాము మద్దతు తెలిపామని చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, కేంద్రంలో చక్రం తిప్పాలని లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Next Story