Mon Nov 18 2024 12:26:40 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీని ఇరికించేందుకు సీబీఐ కుట్ర మొదలయింది
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కొందరు రాజకీయంగా దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై కొందరు రాజకీయంగా దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పనిగట్టుకుని కొందరు వివేకా హత్యకు సంబంధం లేని వారి పేర్లను బయటకు లాగుతున్నారన్నరాు. సీబీఐ ఛార్జి షీటు అంటూ ఒక వర్గం మీడియా కొందరి పేర్లను ప్రస్తావిస్తూ దుష్ప్రచారాం చేస్తుందని చెప్పారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి జెంటిల్మెన్ అని చెప్పారు. హత్యకు జరగక ముందే అవినాష్ రెడ్డికి మద్దతుగా వైఎస్ వివేకానందరెడ్డి ప్రచారం చేసిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు.
ఈ ప్రచారం దారుణం....
తన టిక్కెట్ దక్కదన్న అక్కసుతోనే అవినాష్ రెడ్డి వైఎస్ వివేకాను హత్య చేశారని ప్రచారం చేయడం దారుణమని చెప్పారు. కొందరికే ఉపయోగపడేలా ఈ ప్రచారం సాగుతున్నట్లు కన్పిస్తుందన్నారు. వివేకా హత్యకు జరిగిన కుట్ర కంటే ఇప్పుడు పెద్ద కుట్ర జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎన్నికల ముందు జరిగిన వివేకాహత్య జగన్ ను బాగా కుంగదీసిదని ఆయన చెప్పారు. మార్చి 15న హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉందని సజ్జల గుర్తు చేశారు.
పేర్లు చెప్పాలని వత్తిడి.....
సీబీఐ కూడా ఒక పథకం ప్రకారం ఈ హత్య కేసులో వైసీపీని ఇరికించేందుకు కుట్ర చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. శివశంకర్ రెడ్డి ఫోన్ చేస్తేనే వైఎస్ వివేకా ఇంటికి అవినాష్ వెళ్లారన్నారు. కొందరు సీీబీఐ అధికారులు కొన్ని పేర్లు చెప్పాలని తమపై వత్తిడి చేస్తున్నారని న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారన్నారు. హత్య జరిగిన ఇన్నాళ్లకు కొన్ని పేర్లను బయటకు తెచ్చి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా సీీబీఐ వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు.
Next Story