Sun Dec 14 2025 09:56:26 GMT+0000 (Coordinated Universal Time)
Sajjala : చంద్రబాబువి పగటి కలలు.. అధికారంలోకి రావడం కల
ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తికరంగా ఉన్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తికరంగా ఉన్నాయని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు మూడు నెలల్లో వచ్చేస్తామంటారు.. కానీ ఎక్కడికి? అంటూ ఆయన ప్రశ్నించారు. మీడియా సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు. చంద్రబాబు ఏం చేశారని ప్రజల వద్దకు వెళతారని సజ్జల ప్రశ్నించారు. చంద్రబాబు తాను అధికారంలోకి వస్తానని పగటి కలలు కంటున్నారని అన్నారు. ప్రజామోదం తనకే ఉందంటున్న చంద్రబాబు 2019 ఎన్నికల్లోనూ ఇదే చెప్పారన్నారు.
నమ్మే పరిస్థితి లేదు...
చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరని అన్నారు. ప్రభుత్వంపై చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా విషప్రచారం చేస్తుందన్నారు. ఏపీలో అత్యంత పారదర్శకంగా పాలన జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందన్నారు. అవినీతికి తావు లేకుండా జగన్ పాలన సాగుతుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం గతంలో చేసిన అప్పుల బరువును మోస్తూ తమ ప్రభుత్వం సంక్షేమాన్ని కొనసాగించిందన్నారు. పథకాలతో పాటు ఎన్నికల హామీలను అమలు చేశారన్నారు.
Next Story

