Fri Dec 27 2024 13:02:50 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : అడ్డగోలు హామీలతో మీ ముందుకు వస్తే.. మోసపోకండి
చంద్రబాబు అడ్డగోలు హామీలు ఇస్తూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అడ్డగోలు హామీలు ఇస్తూ మరోసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మోసం చేయడంలో కొత్త టెక్నిక్ లను ఉపయోగిస్తున్నారని అన్నారు. అంతర్జాతీయ దొంగల ముఠా వస్తుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ కు గ్యారంటీ అంటూ ముందుకు వస్తున్నారని, వచ్చే ఏడాది జూన్ 20 నుంచి మీ అకౌంట్ లో జమ చేయడం ప్రారంభం అంటూ ఇచ్చిన హామీలను నమ్మితే మరోసారి మోసపోవడమేనని అన్నారు. కొత్తగా ఇస్తున్న టీడీపీ హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించడం అలవాటుగా మార్చుకుందన్నారు.
మరోసారి మోసం చేయడానికి...
ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేయడానికి మరోసారి మీ ముందుకు వస్తున్నాడన్న సజ్జల 2019లో వైసీపీ ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించాడని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సేవామిత్ర యాప్ ద్వారా ఓట్ల విషయంలో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించారని తెలిపారు. 2017లో యాభై లక్షల ఓట్లు తీసేసిన చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని దొంగ ఎత్తులకు దిగుతున్నాడని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు చేస్తున్న పనుల గురించి కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళతామన్నారు. చంద్రబాబు విషయంలో ప్రజలు అప్రమత్తంగా లేకుంటే మరోసారి మోసపోక తప్పదని అన్నారు.
News Summary - sajjala ramakrishna reddy said that chandrababu is once again trying to deceive people by making false promises
Next Story