Sat Nov 16 2024 02:25:48 GMT+0000 (Coordinated Universal Time)
మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం
రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అంటే ఏ ప్రభుత్వమూ భరించలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
రాజధాని నిర్మాణానికి లక్ష కోట్లు అంటే ఏ ప్రభుత్వమూ భరించలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అంత భారం ఏ ప్రభుత్వమూ మోయలేదన్నారు. న్యాయ వ్యవస్థను తాము గౌరవిస్తామని చెప్పారు. చంద్రబాబు ముఠా వికారపు చేష్టలు నిన్న చూశామన్నారు. మూడు రాజధానులని జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. 30 వేల ఎకరాల్లో లక్షల కోట్లు పెడితే మిగిలిన ప్రాంతం మాటేమిటని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రం మొత్తం సమానమే....
రాష్ట్రం మొత్తం తమకు సమానమేనని చెప్పారు. ప్రజల మైండ్ ను విషపూరితం చేసే ప్రయత్నం జరగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. మీడియా పేరుతో టీడీపీ అజెండాను మోస్తున్నారని ఆరోపించారు. సొంత ప్రయోజనాల కోసమే టీడీపీ డ్రామాలు ఆడుతుందని చెప్పారు. తమది రియల్ ఎస్టేట్ ప్రభుత్వం కాదని సజ్జల ఎద్దేవా చేశారు. నిన్న టపాసులు కాల్చి హంగామా చేసింది టీడీపీ అనుకూల వర్గమేనని చెప్పారు. మూడు రాజధానులను ప్రకటించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని ప్రజలు మట్టి కరిపించిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహాలు తీసుకుంటామని చెప్పారు. తాము అనుకున్న మూడు రాజధానులు న్యాయబద్ధమైనదన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము అధికారంలో ఉన్నామని, ఏదైనా ప్రజల మంచి కోసమే నిర్ణయం తీసుంటామని చెప్పారు.
Next Story