Fri Dec 20 2024 05:25:11 GMT+0000 (Coordinated Universal Time)
అసంతృప్తులు సహజమే..త్వరలోనే సర్దుకుంటాయి
వైసీపీ ఆవిర్భవించిన తర్వాత నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు
వైసీపీ ఆవిర్భవించిన తర్వాత నుంచి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికారంలోకి రాకముందు నుంచే పార్టీ కి దక్కిన పదవులు వారికే కేటాయించడం జరిగిందన్నారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకే అణగారిన వార్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదన్ బ్యాక్ బోన్ అని జగన్ ఎప్పుడో చెప్పారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పదవులు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టు పనుల్లోనూ వారికి పెద్దపీట వేశారన్నారు. తొలి కేబినెట్ లోనే జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ కేబినెట్ లో బీసీలకు పెద్దపీట వేశామని, సామాజికన్యాయం పాటించామని ఆయన తెలిపారు.
బాబు బీసీలపైన....
చంద్రబాబు బీసీల మీద కపట ప్రేమ చూపిస్తారని, పదవుల పంపకాల్లో మాత్రం మొండి చేయి చూపిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు కేబినెట్ లో 52 శాతం ఓసీలు ఉన్నారని తెలిపారు. సామాజికన్యాయం నినాదం కాకుండా నినాదాన్ని చేశమని చెప్పారు. కొత్త కేబినెట్ లో జగన్ నలుగురు మహిళలకు చోటు కల్పించారని చెప్పారు. నలుగురు ఉప ముఖ్యమంత్రులు కొనసాగుతారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అణగారిన వర్గాల్లో ఆత్మవిశ్వాసం తీసుకురావాలని పదవులు ఇచ్చామని చెప్పారు. మంత్రి వర్గ విస్తరణ తర్వాత అసంతృప్తులు సహజమేనని, అవి తొందరలోనే సర్దుకుంటాయని తెలిపారు. ప్రస్తుతం వస్తున్న అసంతృప్త వార్తలన్నీ ఊహాగానాలేనని సజ్జలకొట్టి పారేశారు. మంత్రి పదవి దక్కని వారి అనుచరులు అక్కడక్కడ కొంత హడావిడి చేశారన్నారు. ఎన్టీఆర్ తర్వాత మొత్తం కేబినెట్ రాజీనామా చేసింది ఒక్క జగన్ మోహన్ రెడ్డి హయాంలోనేనన్న విషయానని ఆయన గుర్తు చేశారు.
Next Story