Sun Dec 22 2024 23:14:07 GMT+0000 (Coordinated Universal Time)
సజ్జల కాన్వాయ్ కు ప్రమాదం
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణించే కాన్వాయ్ ప్రమాదానికి గురయింది
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణించే కాన్వాయ్ ప్రమాదానికి గురయింది. కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. గుత్తి ఫ్లైఓవర్ వద్ద వాహనాలు అదుపుతప్పి ఒకటినొకటి ఢీకొన్నాయి. కర్నూలు జిల్లాలో ఒక వైసీపీ నేత ఇంట వివాహానికి హాజరయ్యేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి కర్నూలు వెళ్లారు.
పెళ్లికి హాజరై....
పెళ్లికి హాజరై గెస్ట్ హౌస్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. వేరే వాహనంలో సజ్జల రామకృష్ణారెడ్డి బయలుదేరి గెస్ట్ హౌస్ కు వెళ్లారు. సజ్జల కాన్వాయ్ ప్రమాదానికి గురయిందని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పెద్దయెత్తున గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.
Next Story