Sun Dec 22 2024 23:32:13 GMT+0000 (Coordinated Universal Time)
Ysrcp : చిక్కుకుపోయిన విద్యార్థులను రప్పిస్తాం
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థుల విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు
ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల విషయంలో అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా విదేశాంగ శాఖతో మాట్లాడారన్నారు. లేఖ కూడా రాశారని సజ్జల తెలిపారు. ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులు నిత్యం ఉక్రెయిన్ లోని రాష్ట్ర విద్యార్థులతో మాట్లాడుతూ వారికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ప్రయత్నిస్తున్నాం....
విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొని ఉందన్నారు. అక్కడ తెలుగు కమ్యునిటీతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందన్నారు. ప్రతి అంశంపై చంద్రబాబుకు రాజకీయం చేయడం అలవాటుగా మారిందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story