Mon Dec 23 2024 10:22:24 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సంక్రాంతి సెలవులు అప్పటి నుండే..
శని, ఆదివారాల్లో పండుగలు రావడంతో.. రెండ్రోజుల సెలవులు తగ్గుతున్నాయని విద్యార్థులు ఫీలవుతున్నారు. ఇదిలా ఉండగా..
సంక్రాంతి.. ఏపీలో అత్యంత వైభవంగా.. పిల్లలు, పెద్దలు, నూతన దంపతులంతా కలిసి జరుపుకునే నాలుగు రోజుల అతిపెద్ద పండుగ. రాష్ట్రంలోని విద్యాసంస్థలతో పాటు.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సైతం రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి 16 వరకు పండుగ సెలవులు, జనవరి 17న స్కూళ్లు తిరిగి తెరుచుకుంటాయని అధికారులు వెల్లడించారు. స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 17 వరకు సెలవులు ఉంటాయన్నారు. దీనిపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
కాగా.. తెలంగాణలో మాత్రం 2023 సంక్రాంతికి సెలవులు ఐదురోజులేనని తెలుస్తోంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 13 నుంచి స్కూళ్లు, కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. తిరిగి జనవరి 18న స్కూళ్లు, కాలేజీలు తిరిగి తెరుచుకుంటాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. శని, ఆదివారాల్లో పండుగలు రావడంతో.. రెండ్రోజుల సెలవులు తగ్గుతున్నాయని విద్యార్థులు ఫీలవుతున్నారు. ఇదిలా ఉండగా సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సంక్రాంతి పయనానికి ఇప్పటికై రైళ్లన్నీ ఫుల్ రిజర్వేషన్ అయిపోగా.. బస్సులు కూడా ఫుల్ గా బుక్కైపోతున్నాయి. ఎన్ని స్పెషల్ బస్సులు కేటాయించినా ప్రయాణికుల రద్దీ అలాగే ఉంటోంది. సొంతవాహనాల్లో బయల్దేరే వారి వల్ల టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది.
Next Story