Mon Dec 23 2024 15:44:11 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ఎమ్మెల్యే ముఖం చూడటరట.. వైసీపీ నేతల ప్రతిజ్ఞ
పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పై అదే పార్టీకి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
పాయకరావుపేట నియోజకవర్గం ఎప్పుడూ అంతే. అక్కడ ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా సుఖంగా ఉండరు. రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో ఎమ్మెల్యేలు అగ్రకులాల పెద్దల అదుపులోనే ఉండాలి. లేకుంటే ఆ ఎమ్మెల్యేకు కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనితను సయితం అదే పార్టీలోని నేతలు అష్టకష్టాలు పెట్టారు. ఎమ్మెల్యే తమ చెప్పు చేతల్లో ఉండకపోతే అధిష్టానాన్ని బెదిరించడానికైనా వీరు వెనకడారు.
ఆత్మీయ సమావేశం పేరుతో....
ఇప్పుడు పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పరిస్థితి కూడా అంతే. ఆయన పై వైసీపీకి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి గొల్ల బాబూరావుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఇక బాబూరావు మొఖం చూడబోమంటూ ప్రతిజ్ఞ బూనారు. తమను వైసీపీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని, పురుగుల్లా చూస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై అధిష్టానం కూడా దృష్టి సారించింది. గొల్ల బాబూరావు ఈ ఘటనపై స్పందించాల్సి ఉంది.
- Tags
- golla baburao
Next Story