Thu Dec 19 2024 14:44:31 GMT+0000 (Coordinated Universal Time)
ప్రత్తిపాటి పుల్లారావుపై అట్రాసిటీ కేసులు.. కారణమిదే !
తనను కులంపేరుతో దూషించారంటూ ప్రభుత్వ ఉద్యోగిని ప్రత్తిపాటి తో పాటు మరికొందరిపై పోలీసులకు..
గుంటూరు : ఏపీ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనను కులంపేరుతో దూషించారంటూ ప్రభుత్వ ఉద్యోగిని ప్రత్తిపాటి తో పాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. నిన్న పల్నాడు జిల్లాలోని చిలకలూరి పేట నుంచి నీటి చెరువు వద్ద ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభ సమయంలో టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ ను టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని మునిసిపల్ సూపర్వైజర్ కోడిరెక్క సునీత అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు 323,34,353,506,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ప్రత్తిపాటి పుల్లారావును ఏ1 గా, మదన్ మోహన్ ఏ2, ఏ3గా బండారుపల్లి సత్యనారాయణ, ఏ4గా శ్రీనివాసరావును, ఏ5గా కరీముల్లాను చేర్చారు. మాజీమంత్రిపై అట్రాసిటీ కేసు నమోదవ్వడంతో గుంటూరు రాజకీయాలు వేడెక్కాయి. పుల్లారావుపై అట్రాసిటీ కేసు నమోదు చేయడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story