Sat Nov 23 2024 00:42:01 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రజలకు అలర్ట్.. రాత్రికి ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు
నైరుతి బంగాళాఖాతంతో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తరించిన ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు..
ఏపీలో రానున్న మూడు రోజుల్లో.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంతో పాటు ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో విస్తరించిన ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రతో పాటు యానాం, ఉత్తర కోస్తాలోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ రోజు (జులై 10) రాత్రికి విశాఖ, గుంటూరు, గోదావరి, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మంగళ, బుధ వారాల్లోనూ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు సూచించారు. గత రాత్రి నుంచి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు విశాఖ లోనూ మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడుతున్నాయి. గడిచిన 12 గంటల్లో విజయవాడలోని కృష్ణలంక మునిసిపల్ హైస్కూల్ రోడ్ లో 46.75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
Next Story