Sat Dec 21 2024 07:50:20 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖ క్రికెట్ మ్యాచ్ లో ఓ వీరాభిమాని..?
విశాఖ స్టేడియంలో ఒక యువకుడు సేవ్ ఏపీ ఫ్రం వైసీీపీ అని ప్లకార్డు పట్టుకున్న దృశ్యం వైరల్ గా మారింది
విశాఖ స్టేడియంలో ఒక యువకుడు సేవ్ ఏపీ ఫ్రం వైసీపీ అని ప్లకార్డు పట్టుకున్న దృశ్యం వైరల్ గా మారింది. గత ఆదివారం విశాఖలో జరిగిన భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రం వైఎస్సార్సీపీ అంటూ ఒక యువకుడు ప్లకార్డును స్టేడియంలో ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. భారత్ టీం బ్యాటింగ్ చేస్తుండగా ఒక్కసారి టీవీలలో కనిపించడంతో అధికార పార్టీ నేతలు అవాక్కయ్యారు.
సోషల్ మీడియాలో....
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తెలుగుదేశం పార్టీ, జనసేన అభిమానులయితే తమ వాట్సప్ లో ఈ ఫొటోను స్టేటస్ గా పెట్టుకుంటున్నారు. ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్ ను కూడా రాజకీయాలు వదిలిపెట్టడం లేదన్న విమర్శలు మరొక వైపు వినిపిస్తున్నాయి. స్టేడియం బయట బందోబస్తు ఉన్న పోలీసులు ప్లకార్డులను ఎందుకు పరిశీలించలేదని అధికార వైసీపీ నుంచి నేతలు ఫైర్ అవుతున్నారు.
Next Story