Mon Dec 23 2024 08:16:05 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ లో టెన్త్ ఇంటర్, పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలకు షెడ్యూలు విడుదలయింది.
ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలకు షెడ్యూలు విడుదలయింది.మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఈ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. మే 2వ తేదీ నుంచి 13 వ తేదీ వరకూ పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఏప్రిల్ 8వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ ఇంటర్ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ మొదటి, ద్వీతీయ సంవత్సరానికి సంబంధించిన తేదీలను ఈ సందర్భంగా విడుదల చేశారు.
కరోనా కారణంగా...
కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలు జరగడం లేదు. అయితే ఈసారి కోవిడ్ తగ్గుముఖం పడుతుండటం, పాఠశాలలు, కళాశాలలు కొనసాగుతుండటంతో ప్రభుత్వం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఉపాధ్యాయులు పీఆర్సీ నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో పరీక్షల తేదీలను ప్రభుత్వం విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉపాధ్యాయులు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలని ప్రభుత్వం కోరుతుంది.
Next Story