Mon Dec 23 2024 14:50:18 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఈరోజు నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం ఈరోజు నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి పన్నెండో తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అదే రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం ఉండటంతో ఒకరోజు వేసవి సెలవులను పొడిగించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం వేసవి సెలవులను ఒకరోజు పొడిగించింది.
పాఠ్యపుస్తకాలు, కిట్లు...
పాఠశాలలు నేటి నుంచి ప్రారంభం కానుండటంతో ఈరోజు నుంచి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, కిట్లు పంపిణీ చేయనున్నారు. విద్యార్థులకు బూట్లు, బ్యాగ్ లతో పాటు పుస్తకాలు, డ్రెస్ లు కూడా నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. కొద్ది రోజుల నుంచి ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక కోసం ఇంటింటా తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు.
Next Story