Mon Nov 04 2024 18:35:02 GMT+0000 (Coordinated Universal Time)
ఆర్కే బీచ్ లో ముందుకొచ్చిన సముద్రం
విశాఖపట్నంలో ఆర్కే బీచ్ సముద్రం ముందుకొచ్చింది. సమీపంలోని చిన్న పిల్లల పార్కు పది అడుగుల మేర కోతకు గురయింది.
విశాఖపట్నంలో ఆర్కే బీచ్ సముద్రం ముందుకొచ్చింది. సమీపంలోని చిన్న పిల్లల పార్కు పది అడుగుల మేర కోతకు గురయింది. బల్లలు, బొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో పర్యాటకులను అనుమతించకుండా అధికారులు బ్యారికేడ్లను నిర్మించారు. ఆర్కే బీచ్ వద్ద 200 మీటర్ల వరకూ కోతకు గురైనట్లు గుర్తించారు. ఆర్కే బీచ్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకూ భూమి కోతకు గురయింది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది.
కోతకు గురైన....
సముద్రం ఒక్కసారిగా ముందుకు రావడంతో అక్కడ ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో ఆర్కే బీచ్ వద్ద పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. సందర్శకులు రాకుండా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. జవాద్ తుపాను నేపథ్యంలోనే సముద్రం ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు.
Next Story