Mon Dec 23 2024 19:03:08 GMT+0000 (Coordinated Universal Time)
నవంబరు 9 నుంచి ఏపీలో స్లీ ప్లేన్ సేవలు
ఆంధ్రప్రదేశ్ లో సీ ప్లేన్ సేవలు నవంబరు 9వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి
ఆంధ్రప్రదేశ్ లో సీ ప్లేన్ ను నవంబరు 9వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకు వస్తామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నవంబరు 9న తొలిసారిగా సీప్లేన్ సర్వీసులను ప్రారంభించనున్నట్టు రామ్మోహన్నాయుడు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకు ట్రయల్ రన్ నిర్వహిస్తామని విశాఖ లో చెప్పారు. చంద్రబాబు నాయుడు సీ ప్లేన్ ను ప్రారంభించనున్నారు.
ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకూ...
ఈ ప్రాజెక్టు కోసం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎంతో కృషి చేశారు. సీప్లేన్ సర్వీసులు అందుబాటులోకి వస్తే అతి తక్కువ ఖర్చులో ఒకేరోజు రాష్ట్రంలోని విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాలు దర్శించుకోవచ్చు. నిజానికి 2014 -201 మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు సీ ప్లేన్ ను అందుబాటులోకి తేవాలని ప్రయత్నించారని, అయితే సమయం సరిపోలేదని, అప్పట్లో పౌర విమానయాన శాఖ అనుమతులు కూడా లభించలేదని తెలిసింది.
Next Story